కూటమీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టే ఎన్నికలు వాయిదా..

karunakar-reddy-03.jpg

తిరుపతిలో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ మా పార్టీ విజయం సాధించేది కాబట్టి, కూటమి గెలిచే పరిస్థితి లేదని భావించి, ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికల కమిషన్ దీనిపై తక్షణమే స్పందించాలని కోరుతున్నాం అని అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, టీడీపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్నికల అధికారి టీడీపీ అనుకూలంగా పనిచేశారని చెప్పిన ఆయన, కిడ్నాప్ అయిన కార్పొరేటర్లను తీసుకోవాల్సిన బాధ్యత ఎస్పీ మీద ఉందా? అని ప్రశ్నించారు. తిరుపతి ఎమ్మెల్యే మదన్ గూండాయిజం చేస్తూ రాజకీయ క్షోభను సృష్టించారని ఆయన ఆరోపించారు.

కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు. పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? మహిళా కార్పొరేటర్‌ అని కూడా చూడకుండా దాడి చేశారు. మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు. మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి. మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్‌లో పాల్గొనం అని మేయ‌ర్ శిరీష పేర్కొన్నారు. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మెజారిటీ కార్పొరేటర్లు వైయ‌స్ఆర్‌సీపీ వైపే ఉన్నారు. ఒక్క కార్పొరేటర్‌ బలమే ఉన్న టీడీపీ నేతలు వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లపై దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్లు వెళ్తున్న వాహనంపై దాడి చేయమేంటి? చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా? ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? అర్థరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్న గదికి వెళ్లి దౌర్జన్యం చేశారు.

Share this post

scroll to top