తొక్కిసలాటకు చంద్ర‌బాబుదే బాధ్యత..

bhumana-karunakar-reddy-09.jpg

తిరుమల తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ నెల రోజులుగా రోజుకో సమీక్ష పేరుతో వైకుంఠ ఏకాదశికి చేశారు. పనిచేసేవాళ్ళు తక్కువై పోయారు. పర్యవేక్షించే వారు ఎక్కువై పోయారు. వ్యవస్థను పూర్తి గా వైఫల్యం చెందించారు. టీటీడీ, పోలీసులు, టీటీడీ నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందారు. క్రైమ్ డీఎస్పీ పద్మావతి పార్క్ లో పశువులు మంద తోలినట్లు భక్తులను తోలారు. గత ప్రభుత్వం హయంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశాం. ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా అద్భుతంగా నిర్వహించాం. టీటీడీని రాజకీయ క్రీడా మైదానం గా మార్చారు. మీరు చేస్తున్న తప్పులతో భక్తులకు కష్టాలు తలెత్తాయి. టీటీడీ ఛైర్మన్‌ను కనీసం ఈవో, అడిషనల్ ఈవో పట్టించుకునే పరిస్థితి లేదు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరీకి చంద్రబాబు సేవ తప్పా, భక్తులు సేవ లేదు. బ్రేక్ దర్శనాలు 7 వేలకు పైగా ఇస్తున్నారు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి దీనికి పూర్తి బాధ్యత వహించాలి. అని భూమన వెల్లడించారు.

Share this post

scroll to top