చంద్రబాబు రాజకీయం కోసం కలియుగ దైవాన్ని కూడా వదిపెట్టడు..

karunakar-reddy-22.jpg

తిరుమల వెంకటేశ్వరస్వామి, అరకు కాఫీ, కూచిపూడి నృత్యం ఏపీ వారసత్వ సంపద అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం. కలియుగ దైవాన్ని అరకు కాఫీతో ఎలా పోలుస్తారు? ఇదేనా స్వామివారి పట్ల చంద్రబాబుకు ఉన్న భక్తితత్వం? గతంలో తిరుమలలో నీటి ఎద్దడి వల్ల శ్రీవారి ఆలయాన్ని మూడు నెలల పాటు మూసివేయాలని అధికారులు తనకు సూచించారని, తాను వ్యతిరేకించడంతో పాటు తొంబై రోజుల్లో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించకపోతే ఆ అధికారులను అరెస్ట్ చేస్తానని హెచ్చరించినట్లు చంద్రబాబు చెప్పుకున్నారు. ఆలయాన్ని మూసేయాలన్న ఆ అధికారులు ఎవరో చంద్రబాబు బయటపెట్టాలి. ఏ అధికారంతో వారిని అరెస్ట్ చేస్తానని చంద్రబాబు హెచ్చరించారో కూడా వివరించాలి.

లేని దానిని ఉన్నట్లుగా సృష్టించి, గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకు మాత్రమే తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రక్షాళనతోనే పాలన ప్రారంభించామని, అందుకే ఈఓగా శ్యామలరావును నియమించామని చంద్రబాబు చెప్పుకున్నారు. శ్యామలరావుతో ప్రక్షాళన ప్రారంభమయ్యిందని అనుకుంటే ఆయనతో సమానస్థాయి ఉన్న అధికారులకు ఎవరికీ కూడా సమర్థత లేదని చంద్రబాబు అంగీకరించినట్లే కదా? ఇదే శ్యామలరావు లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని కూడా ప్రకటించారు. ఆయన సమర్థతను చూసిన సీఎం చంద్రబాబు శ్యామలరావు చేసిన ప్రకటనకు భిన్నంగా లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రకటన చేశారు. ఇదేనా శ్యామలరావుపై మీకున్న నమ్మకం.

Share this post

scroll to top