ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది.. ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.. పలువురు ప్రజాప్రతినిధులు, నేతులు.. వైసీపీకి గుడ్‌బై చెప్పేసి.. కూటమి వైపు వచ్చేస్తున్నారు.. మరీ ముఖ్యంగా.. టీడీపీ గూటికి చేరుకుంటున్నారు.. ఈ పరిస్థితులతో ఇప్పటికే పలు మున్సిపాల్టీలు టీడీపీ ఖాతాలోకి పడిపోయాయి.. అయితే, తాజాగా, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు పులిచెర్ల జడ్పీటీసీ మురళీధర్.. వైసీపీకి, జెడ్పీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. అతని బాటలో పులిచెర్ల వైస్ ఎంపీపీలు రాశి ప్రసాద్, ఈశ్వరి గోవర్ధన్ లు కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పారు.. వీరితో పాటు నలుగురు ఎంపీటీసీ సభ్యులు.. మరో ఏడు మంది సర్పంచులు రాజీనామా బాటపట్టారు..
పెద్దిరెడ్డికి బిగ్ షాక్..! పార్టీకి ప్రధాన అనుచరుడితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు గుడ్‌బై..
