కూటమి ప్రభుత్వానికి వాలంటీర్లు షాక్ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థను త్వరలోనే రద్దు చేయాలంటూ డిమాండ్లు వస్తుండడంతో వాలంటీర్లు సంచలన ప్రకటన చేశారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ టీడీపీ నేత, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు YVB రాజేంద్రప్రసాద్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఆయన ఉపసంహరించుకోవాలని, లేదంటే 2.60 లక్షల మంది వాలంటీర్లు వీధి పోరాటాలకు దిగుతారని హెచ్చరించింది.
వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లకు ఇవ్వాలని కోరడం దారుణమని పేర్కొంది. తమని తిరిగి విధుల్లోతి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం వాలంటీర్లను పెన్షన్లు పంచడం, సంక్షేమ పథకాలు అందించడంలో వీరే కీలకంగా వ్యవహరించేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వారిని పక్కనపెట్టి సచివాలయ ఉద్యోగులను పెన్షన్ల పంపిణీకి ఉపయోగించడం మొదలుపెట్టింది.