కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్..

ravanth-11.jpg

తెలంగాణలోని వాసులకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలోని రేషన్ కార్డు లేని ప్రజలకు కొత్తగా రేషన్ కార్డులను ఏర్పాటు చేయనుంది. రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య మూడు కోట్లకు దాటినట్లుగా సివిల్ సప్లయ్ అధికారులు వెల్లడించారు. రెండు లక్షలకు పైగా కొత్త కార్డులు, 29 లక్షలకు పైగా కొత్త సభ్యులు రేషన్ కార్డులో చేరినట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం 79.49% కుటుంబాలకు తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్నాయని సివిల్ సప్లై అధికారులు వెల్లడించారు. కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే ఉన్నట్లుగా వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా సమాచారం అందుతోంది.

Share this post

scroll to top