ఒంటరిగా మారిపోనున్న సోనియా.. 

soniya24-.jpg

ఎప్పుడూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పటివరకు మిత్రులుగా ఉన్న వాళ్లే ఆ తర్వాత శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఇప్పుడు సోనియా విషయంలో అదే జరిగే పరిస్థితి కనిపిస్తోంది. హౌస్ లో ఆమె ఎవరితో అయితే క్లోజ్ గా ఉందో ఎవరితో అయితే సర్కిల్ ఏర్పాటు చేసుకుందో.. ఇప్పుడు వాళ్లే ఆమెకు శత్రువులుగా మారిపోయో పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హౌస్ లో ఇప్పుడు సోనియా ఒంటరిగా మారిపోనుంది అనే విషయం అయితే క్లారిటీ వస్తోంది. ఇంక ఆమె అనుకున్నది సాధించడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు నిర్మించుకున్న సర్కిల్ చల్లా చెదురు అయిపోయింది.

సోనియా హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆమె స్ట్రాంగ్ ప్లేయర్ అనే విషయంపై అందరికీ నమ్మకం ఉంది. ఆమె ఆర్గుమెంటల్ స్కిల్స్ మీద కూడా ఆడియన్స్ కి మంచి నమ్మకం ఏర్పడింది. కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్ అవుతుంది అని మొదటి వారమే నమ్మేశారు. అయితే ఆ తర్వాత అంచనాలు తలకిందులు అయ్యాయి. సోనియా ఎక్కువ మైండ్ గేమ్స్ ఆడటం ప్రారంభించింది. ఎవరైతే హౌస్ లో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్లనే టార్గెట్ చేస్తూ వారితో క్లోజ్ అవుతూ వచ్చింది. సలహాలు ఇస్తూనే వారిని తన కంట్రోల్ లోకి తీసుకుంది. ఆ తర్వాత వారితో తన ఆటను ముందుకు తీసుకెళ్లింది. అయితే అది కేవలం రెండు వారాలు మాత్రమే నడిచినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత వాళ్లకు సోనియా ఆట మీద క్లారిటీ వచ్చేసింది.

Share this post

scroll to top