హీటెక్కిన నామినేషన్స్‌..

bigg-boss-07.jpg

బిగ్ బాస్ ఇంటిలో అడుగుపెట్టిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్లకు మొదటి వారం నామినేషన్స్ ఉండదని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ హరితేజతో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలు అయింది. ఇంటి సభ్యుని మెడలో ఫోటో వేసి అతనిని నామినేట్ చేయడం ఈ వీక్ స్టైల్.

బిగ్ బాస్ సీజన్ 8లో ఓల్డ్ కంటెస్టెంట్లకు ‘ఓజీ’ క్లాన్ అని, వైల్డ్ కార్డ్ ద్వారా అడుగు పెట్టిన కొత్త కంటెస్టెంట్లకు రాయల్ క్లాన్ అని పేర్లు పెట్టిన సంగతి తెలిసింది. రాయల్ క్లాన్ సభ్యులలో ఇద్దరినీ నామినేట్ చేసే అవకాశం ఓజీ క్లాన్ సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చారు. అప్పుడు గంగవ్వతో పాటు మెహబూబ్ దిల్ సేను పాత సభ్యులు నామినేట్ చేశారు. మరి వాళ్ళిద్దరికీ ఏయే కారణాలు చెప్పారో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 8లో ఈవారం నామినేట్ అయిన ఆరుగురు సభ్యులలో ఇద్దరు వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు గంగవ్వ, మెహబూబ్‌ దిల్ సే కాగా మిగతా నలుగురు పాత కంటెస్టెంట్లు. వారిలో యష్మీ గౌడ, విష్ణు ప్రియా భీమనేని, కిరాక్ సీత, పృథ్వీ ఉన్నారు. మరి ఈ వీకెండ్ ఎవరు ఎవిక్ట్ అవుతారో చూడాలి.

Share this post

scroll to top