రీ ఎంట్రీ ఇస్తున్న మన్మధుడు బ్యూటీ..

Anshu-ambani.jpg

హీరో నాగార్జున నటించిన ‘మన్మధుడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అన్షు అంబానీ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆ తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాలో నటించి తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసింది. చేసింది కొన్ని సినిమాలే కానీ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా ఇప్పుడు ఆమె రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి సందీప్ కిషన్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో, హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ దండ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం అన్షు కి దర్శకుడు కథ చెప్పినట్లుగా తెలుస్తోంది. కథ , తన పాత్ర నచ్చడంతో ఆమె సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆమెకు తెలుగులో రీఎంట్రీ సినిమాగా నిలవబోతున్నట్లు చెబుతున్నారు. మరి అవి ఎంత వరకూ నిజమో తెలియాలి అంటే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచిచూడాల్సిందే.

Share this post

scroll to top