ఈ ఇంట్లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటూ విష్ణు అడిగితే పృథ్వీ అని చెప్పింది గంగవ్వ. మరి నేను ఇష్టం లేదా అంటూ విష్ణు అడిగితే నువ్వు కూడా ఇష్టమే అని అమాయకంగా అంది గంగవ్వ. తల్లి లేని పిల్ల కదా మనం అన్నీ చేయాలి అంటూ గంగవ్వ అంటుంటే పృథ్వీ అందుకే అవ్వ నేను గెలిచినా సూట్ కేసును విష్ణుకి ఇచ్చాను అని అన్నాడు దానికి గంగవ్వ అదిరిపోయే పంచ్ వేసింది. అవును మరి నీకు అన్నం తినిపిస్తాంది. అన్నీ చేస్తాంది ఓ చెల్లి తీరుగా అంటూ గంగవవ్వ అంది. దాంతో విష్ణు ప్రియా, పృథ్వీ లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. హరితేజ అయితే తెగ నవ్వుకుంది. ఆతర్వాత విష్ణుకి పృథ్వీ అంటే ప్రేమ అని హరితేజ గంగవ్వకు చెప్పింది. దానికి కూడా కౌంటర్ వేసింది గంగవ్వ. ఏ అది ఈ హౌస్ వరకే బయటికిపోతే ఉండదీ అంటూ అదిరిపోయే పంచ్ వేసింది గంగవ్వ.
విష్ణు ప్రియా, పృథ్వీల గాలి తీసేసిన గంగవ్వ..
