వీడినే అందరూ ఓదార్చాలి అన్నట్లుగా ఏడుపొకటి..

mani-kanta-05.jpg

బిగ్ బాస్ సీజన్ 8లోకి త్వరలో కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే ముగ్గురు ఫైనల్ అయ్యారని అంటున్నారు. గత సీజన్ లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించిన వారు ఇప్పుడు మరోసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ మరోసారి సందడి చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో మణికంఠతో పులిహోర కలిపింది యష్మీ. నిన్నటివరకు ఈ ఇద్దరి మధ్య అస్సలు పడేది కాదు. ఎలాగైనా మణికంఠను హౌస్ నుంచి బయటకు పంపాలని చూసింది యష్మీ. కానీ ఇప్పుడు ప్లేట్ తిప్పేసింది. మణికంఠకి నేనున్నా అంటూ భరోసా ఇచ్చింది యష్మీ నీ నవ్వు చూసే నీకు పడిపోయా అంటూ మణికంఠకు డైలాగ్స్ కొట్టింది యష్మీ. నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా ఆదిత్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ యష్మీ కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు.

హౌస్ మేట్స్ అంతా కలిసి మణికంఠ మీద పడ్డారు. ఫస్ట్ విష్ణుప్రియ స్టార్ట్ చేసింది. అక్కడ మా టెన్షన్‌లో మేముంటే అప్పుడు కూడా కెమెరాలన్నీ వీడి వైపే ఉండాలి. వీడినే అందరూ ఓదార్చాలి అన్నట్లుగా ఏడుపొకటి మొదలుపెట్టాడు అని మణికంఠను ఉద్దేశించి విష్ణుప్రియ అంది. దాంతో మనోడు ఎప్పటిలానే సమాధానం చెప్పాడు. ఏమో నాకు అంతా బ్లాంక్  అయ్యింది రా అని అన్నారు మణి. సైరన్ మోగగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని నువ్వే చెప్పావంటగా ఇంకెందుకు బ్లాంక్ అయ్యావ్ అని నబీల్ అన్నాడు. ఇంతలో సీత అందుకొని ఎందుకు నువ్వు మాటిమాటికి అందరూ నిన్ను ఓదార్చాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తావ్ అని అడిగింది. దాంతో సైలెంట్ గా మణి పక్కకు వెళ్ళిపోయాడు. మణికంఠ వెళ్ళిపోయినా తర్వాత మనం ఇంత అర్థం చేసుకున్నా వాడెందుకు మనల్ని అర్థం చేసుకోవట్లేదు. అందరితో గొడవ పెట్టుకొని తిట్టేసి తర్వాత వాడు కెమెరా ముందుకొచ్చి ఏడుస్తాడు. దాని వల్ల మనం బ్యాడ్ అవుతాం అని సీత చెప్పుకొచ్చింది.

Share this post

scroll to top