ఈ వారం నామినేషన్లలో నిఖిల్ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయ్యింది. సోనియా, సీత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా సీత చేసిన ఆరోపణలతో నిఖిల్ బాగా హర్ట్ అయ్యాడు. నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ను వాడుకుని వాళ్లను గేమ్ ఆడకుండా చేసి గెలవాలని చూస్తావ్ అంటూ నిఖిల్ పై సీత కామెంట్స్ చేసింది. దీంతో నిఖిల్ షాకయ్యాడు. ఆ తర్వాత ఒంటరిగా కూర్చుని బాధపడ్డాడు. యష్మీ దగ్గర ఇదే పాయింట్ తీస్తూ చాలాసేపు డిస్కస్ చేశాడు నిఖిల్. ఇక నిన్నటి ఎపిసోడ్ లో తాను బయటకు వెళ్లిపోతా అని తనకు ఓట్లు వేయొద్దని అడియన్స్ కు రిక్వెస్ట్ చేశాడు.
నిఖిల్ యష్మీతో మాట్లాడుతూ సీత స్టేట్మెంట్ ఇచ్చింది. నేనెప్పుడైనా గేమ్ పరంగా నిన్ను వాడుకున్నట్లు అనిపించిందా అని అడగ్గా లేదు అంటూ ఆన్సర్ ఇచ్చింది యష్మీ. మరీ ఇదే మాట అక్కడ చెప్పొచ్చుగా అని అడిగాడు నిఖిల్. ఆ మాట చెప్పగానే నేను షాకయ్యాను అని యష్మీ చెప్పడంతో నువ్వు అక్కడ థాంక్యూ అన్నావ్ అంటూ అసలు పాయింట్ తీశాడు నిఖిల్. నేను అన్నది పానీపట్టు టాస్కుకు ఎఫర్ట్స్ కనిపించలేదు కానీ నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెడుతుంది మాకు కనిపిస్తుంది అందుకు థాంక్స్ చెప్పాను అంటూ యష్మీ కవర్ చేసింది. ఇక ఆ తర్వాత యష్మీ, నిఖిల్ మధ్య మరోసారి రోహిణి టాపిక్ డిస్కషన్ జరిగింది.
యష్మీ వెళ్లిపోయాక కెమెరాతో నిఖిల్ మాట్లాడుతూ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కొంతమందే తెలుసు. వాళ్లతో కలిసి ఒకరిని తొక్కి ఆడాలని ఎప్పుడూ అనుకోలేదు. నామినేషన్లలో సీత చెప్పినట్లు స్ట్రాంగ్ ఉమెన్ ను వాడుకొని నేను గేమ్ లో గెలవాలని అనుకోలేదు. నేను ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నా నేను ఉన్నంతవరకు మనసుకి ఏం అనిపిస్తుందో అలాగే ఆడాను.. ఒకరిని తొక్కి వాడుకొని ఈ షో గెలవాలని నేను రాలేదు. నన్ను ఇప్పటివరకు సేవ్ చేస్తూ ఓట్లు వారందరికీ థాంక్స్ నాకు వెళ్లపోవాలనిపిస్తుంది. నా ప్రయాణం అయిపోయింది. నాకు ఓట్లు వేయకండి నన్ను వెళ్లిపోనివ్వండి నాకు వెళ్లిపోవాలని ఉంది’ అంటూ బాధపడ్డాడు. ఆ తర్వాత కాసేపటి నబీల్, పృథ్వీ ఇద్దరు నిఖిల్ తో మాట్లాడారు. దీంతో నిఖిల్ మనసు మార్చుకుని మరోసారి కెమెరాతో మాట్లాడుతూ మంచిగా ఆడి నేనెంటో ప్రూ చేసుకుంటా మీ సపోర్ట్ కావాలి. నేను వెళ్లిపోతా అన్నందుకు సారీ అంటూ ప్రేక్షకులను రిక్వెస్ట్ చేశాడు.