నిన్నటి ఎపిసోడ్ లో మెగా చీఫ్ కంటెండర్స్ అయ్యేందుకు పట్టువదలని విక్రమార్కులు అనే టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్కులో గెలిచేందుకు కంటెస్టెంట్స్ తమ పట్టు వదలకుండా రంగు ప్లాట్ ఫామ్ పై తాడును పట్టుకుని నిలబడాలంటూ బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. ఈ టాస్కులో రోహిణి, తేజ, విష్ణుప్రియ, పృథ్వీ, యష్మీ పోటీపడ్డారు. ఈ టాస్కుకు గౌతమ్ ను సంచాలక్ గా నియమించాడు బిగ్ బాస్. ఇక గౌతమ్ తన దగ్గర ఉన్న డైస్ ను రోల్ చేస్తే అందులో ఏ కలర్ వస్తే ఆ కలర్ డ్రమ్ పై ఉన్నవారి డ్రమ్ తీసేస్తాడు.
అయితే ఇక్కడ డైస్ మీద రెండు కలర్స్ ఉండగా అక్కడ ఉన్నది ఐదుగురు. దీంతో గౌతమ్ కచ్చితంగా వైల్డ్ కార్ట్ ఎంట్రీలకు మాత్రమే సపోర్ట్ చేస్తాడని కన్నడ బ్యాచ్ ఫిక్స్ అయ్యింది. కానీ గౌతమ్ మాత్రం అందరికి షాకిస్తూ డైస్ మీద నంబర్స్ వేశాడు. డైమ్ తిప్పేసరికి ముందుగా పృథ్వీ నంబర్ వచ్చింది. దీంతో పృథ్వీ కింద ఉన్న డ్రమ్ తీసేయగా గాల్లో కాసేపు తాడు పట్టుకుని వేలాడి తర్వాత యష్మీ నిల్చున్న డ్రమ్ పైకి వెళ్లాడు. దీంతో ఇదేనా నువ్వు చెప్పిన ఇండివీడ్యూవల్ గేమ అంటూ రోహిణి అంటూ కౌంటరిచ్చింది రోహిణి. ఆ తర్వాత రోహిణి పేరు రాగా కాసేపు గాల్లో వేలాడి తేజ డ్రమ్ పైకి చేరింది. ఆ తర్వాత విష్ణు గేమ్ నుంచి అవుట్ అయ్యింది. మరోసారి డైస్ వేయగా యష్మీ నంబర్ రావడంతో ఆమె డ్రమ్ తీసేశాడు గౌతమ్. దీంతో పృథ్వీ, యష్మీ చాలాసేపు గాల్లో వేలాడగా ముందుగా యష్మీ కిందపడిపోయింది. ఆ తర్వాత పృథ్వీ సైతం వదిలేశాడు. ఈ టాస్కులో తేజ విన్ అయ్యాడు.