బిగ్‌బాస్ హౌస్‌కి న్యూ మెగా చీఫ్‌గా గౌతమ్ అయ్యాడు. కాదు కాదు అయ్యేలే చేశాడు మణికంఠ కాదు కాదు నిఖిల్ కూడా కలిసి చేశాడు కాదు కాదు అదృష్టం కలిసొచ్చింది. యస్ అవును ఇక్కడ గౌతమ్ మొగా చీఫ్ అవ్వడానికి పైన చెప్పిన రీజన్స్ అన్నీ సహకరించాయి. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లు గౌతమ్ మెగా చీఫ్ అవ్వడానికి ఇవన్నీ రీజన్స్‌యే. సింపుల్‌గా చెప్పాలంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనుకునే పృథ్వీ, నిఖిల్, నబీల్ ముగ్గురూ చీఫ్ కంటెండర్‌షిప్ నుంచి ముందే పోయారు. ఇక మిగిలిన స్ట్రాంగ్ కంటెంస్టెంట్స్ అయిన మెహబూబ్, అవినాష్‌లను కూడా తెలివిగా తప్పించేశాడు గౌతమ్. ఆ తర్వాత మిగిలిన లేడీ కంటెస్టెంట్లను గేమ్‌లో ఈడ్చిఈడ్చి మరీ మెగా చీఫ్ అయిపోయాడు.
టాస్క్‌లో అదరగొట్టిన గౌతమ్..
