బీబీ రాజ్యం టాస్కులో రాయల్స్ టీం గెలవడంతో ఓజీ క్లాన్ భారీగానే ప్లాన్ చేసింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో బీబీ రాజ్యం ఛాలెంజ్ కొనసాగింది. ఎనిమిది ధాన్యపు బస్తాలను తోపుడు బండిపై ఎవరు ముందుగా పెడతారో ఆ టీంకు రాజ్యంలో వ్యవసాయం దక్కుతుందని అన్నాడు బిగ్ బాస్. దీంతో ఓజీ టీమ్ నుంచి వచ్చిన నిఖిల్, పృథ్వీ హడలెత్తించారు. వారిద్దరిని అడ్డుకునేందుకు గౌతమ్, మెహబూబ్ చాలావరకు ప్రయత్నించారు. ఈ టాస్కులో రాయల్స్ టీం సభ్యులపై నిఖిల్, పృథ్వీ చెలరేగిపోయారు.
నిన్న ఒక టాస్కులో గెలిచి బీబీ రాజ్యంలో సరస్సును సొంతం చేసుకుంది రాయన్స్ క్లాన్. నిన్న మొదటి టాస్కులో గురించి అనౌన్స్ చేశాడు. అత్యంత బలమైన సేనల్ని కూడా ఆకలి మట్టుబెడుతుంది. ప్రతి రాజ్యానికి ఆహార భద్రత అత్యంత ముఖ్యం. అలాంటి ఆహారాన్ని ఇచ్చే వ్యవసాయం కోసం బిగ్ బాస్ ఇస్తున్న టాస్కు పట్టుకో కార్డులో పెట్టుకో ఇందులో గెలవడానికి 8 ధాన్యపు బస్తాలని మీకు సంబంధించిన రెడ్ లైన్ వెనక్కి కార్డ్ ద్వారా చేర్చడం టాస్కు ముగిసే సమయానికి ఏ క్లాన్ అయితే తమకు చెందిన 8 ధాన్యపు బస్తాలను రెడ్ లైన్ వెనక్కు ముందుగా చేరుస్తారో వారు ఈ టాస్కును గెలుస్తారు. అలాగే వ్యవసాయాన్ని పొంది. మీ క్లాన్ జెండాను పాతొచ్చు అని బిగ్ బాస్ చెప్పడంతో టాస్కు ఎలాగైనా గెలవాలని ఓజీ క్లాన్ ప్రణాళికలు రెడీ చేసుకుంది.