ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో 8వ వారం కొనసాగుతోంది. నామినేషన్స్‌లో పృథ్వీ, విష్ణుప్రియలను మిగిలిన కంటెస్టెంట్స్ దుమ్ము దులిపారు. చాలా వారాలుగా గేమ్ కూడా ఏం కనిపించట్లేదని, అసలు మీరిద్దరూ సింగిల్‌గా ఎక్కడా కనిపించట్లేదు అంటూ ఒకరి తర్వాత ఒకరు వారిని టార్గెట్ చేసి నామినేషన్స్ చేసారు. ఇందులో ముందుగా ప్రేరణ ఏకంగా విష్ణుప్రియ నోటి నుంచి పృథ్వీపై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టేలా విజయవంతమైంది. నామినేషన్స్ తర్వాత అర్ధరాత్రి సమయంలో కన్నడ బ్యాచ్ సభ్యులు ఓ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌లో యష్మీ పృథ్వీకి బాగానే బ్రెయిన్ వాష్ చేసింది.
పృథ్వీ, నిఖిల్, యష్మీ, ప్రేరణలు కలిసి మీటింగ్ పెట్టారు. ఆ సమయంలో నిఖిల్‌కి ప్రేరణ మసాజ్ చేస్తుండగా మరోవైపు పృథ్వీతో యష్మీ సీరియస్ డిస్కషన్ మొదలుపెట్టింది. ఈ డిస్కషన్ లో పృథ్వీ నేను ఒక ఫ్రెండ్‌గా చెబుతున్నా విను అంటూ నాకే మిమ్మల్ని చూస్తుంటే విసుగొచ్చింది.. తను నీకు స్పేస్ ఇవ్వట్లేదు ఇద్దరూ స్పేసే తీసుకోవట్లేదని, ప్రతిసారి ఎక్కడ చూసినా ఇద్దరు ఇద్దరే కనిపిస్తారు. అంటూ చెప్పుకొచ్చింది. ఎంత ఇలా చూస్తుంటే 2,3 రోజులుగా నాకే ఇరిటేషన్ వచ్చేసింది. రేయ్ ఇది ఇండివీడ్యువల్ గేమ్ అంటూ తనపై ఏదైనా ఉంటే బయట చూసుకోమని దానికి ఒక టైమ్ ఉంటుందంటూ నాకే ఇలా అనిపిస్తుందంటే, వేరే వాళ్లకి అనిపించడంలో తప్పేలేదు అంటూ బ్రెయిన్ వాష్ చేసింది.