యష్మీ ప్రేరణను కాపాడుతోందా..

bigg-boss-14.jpg

ప్రేరణ, యష్మీ ఇద్దరూ ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. వాళ్లు హౌస్ లోకి వచ్చిన తర్వాత బాగానే క్లోజ్ గా ఉంటున్నారు. గ్రూప్ గేమర్స్ అని ఆరోపణలు చేస్తే నిఖిల్ అయినా తప్పుకున్నాడు కానీ, ప్రేరణ, యష్మీ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత ఇద్దరూ ఒకే క్లాన్ కూడా అయ్యారు. ఈ వీక్ ప్రేరణను నామినేషన్స్ నుంచి సేవ్ చేసినందుకు కచ్చితంగా ప్రేరణపై ఎంతో కొంత యష్మీ ఇన్ ఫ్లు ఎన్స్ అయితే ఉంటుంది. అదే ఇప్పుడు ప్రేరణ కొంప ముంచేలా కనిపిస్తోంది. ప్రేరణపై చాలానే ప్రెజర్ కనిపించింది. అందులో ఎక్కువ యష్మీ తీసుకొచ్చిందే ఉండటం విశేషం. ఏదైనా ఇబ్బందికర డెసిషన్ రాగానే ముందే వచ్చేసి యష్మీ గైడ్ చేయడం చేసింది. ముఖ్యంగా విష్ణుప్రియ నబీల్ డెసిషన్స్ ప్రేరణకు బాగానే నెగిటివ్ అయ్యాయి.

నిఖిల్ ని మోటివేట్ చేసిన యష్మీ అతను గెలిస్తే తట్టుకోలేకపోయింది. మరి అతడిని మోటివేట్ చేసింది నిజమా బాధ పడింది నిజమా? అలాగే ప్రేరణను కూడా యష్మీ ఇన్ ఫ్లుఎన్స్ చేస్తోంది ఏమో అని అనుమానాలు ఉన్నాయి. అయితే అది గేమ్ లో భాగంగా యష్మీ తన క్లాన్ గెలుపు కోసం చేసిన పోరాటంలో జరిగిన పొరపాట్లు కూడా కావచ్చు. కానీ, మొత్తానికి విలన్ మాత్రం ప్రేరణ అయ్యింది.

Share this post

scroll to top