విష్ణు ప్రియ vs సోనియా.. 

bigg-boss-11.jpg

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 3 గొడవలు- 6 ఆర్గుమెంట్లతో పర్వాలేదు అనిపిస్తోంది. సాధారణంగానే బిగ్ బాస్ లో ఆదివారాన్ని ఫన్ డే అంటారు. కానీ, నిజానికి అసలు మజా సోమవారం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు నామినేషన్స్ జరుగుతాయి కాబట్టి. బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అంటే అసలు సిసలైన ఆట ఉంటుంది. అలాగే అక్కడే చాలా మంది వారి ముసుగు తీసి ఆట ఆడతారు. అలాంటి ఒరిజినాలిటీ కంటెంట్, గొడవలు అన్నీ సోమవారం రోజునే జరుగుతాయి. తాజాగా నామినేషన్స్ లో చాలానే రచ్చ జరిగింది.

విష్ణు ప్రియృ- సోనియా ఆకుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలి అని బాగానే ట్రై చేస్తున్నారు. నిజానికి విష్ణుప్రియకు ఎంతో మంచి ఆపర్చునిటీ వచ్చింది. సోనియాని కార్నర్ చేయడానికి వచ్చిన అవకాశాన్ని పాపం విష్ణు వాడుకోలేకపోయింది. చాలా మెచ్యూరిటీ ప్రదర్శించి ఎంతో పద్ధతిగా మాట్లాడింది. ఎక్కడా కూడా క్యారెక్టర్ అసాసిన్ చేసే మాటలు అస్సలు మాట్లాడలేదు.

ఎలా పడితే అలా నేను ఉండలేను అంటూ నీతులు చెప్పింది. కానీ, ఆమెనే నిఖిల్ తో ఎంతో క్లోజ్ గా కనిపించింది. ఈ విషయంలో కూడా సోనియా కేవలం మాటలు చెప్తుంది కానీ, పాటించదు అనే అభిప్రాయాలు, విమర్శలు వస్తున్నాయి. ఈ ముగ్గురి మధ్య జరిగిన వాదనల్లో, గొడవలో అసలు తప్పు ఎవరిది అనే ప్రశ్నను లేవనెత్తితే మాత్రం.. కచ్చితంగా సోనియా వైపే ఎక్కువ తప్పులు కనిపిస్తున్నాయి. తాను తప్పితే ఎవరూ మెచ్యూర్ కాదు, ఎవరికీ స్వతహాగా ఆలోచించే అంత బుర్రలేదు అనే ధోరణిలో ఆమె మాటలు ఉంటున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే సోనియా మీద నెగిటివిటీ అయితే బాగానే పెరుగుతోంది. 

Share this post

scroll to top