నీ ముందే కంఠం కోసుకొని చచ్చిపోతా..

bigg-boss-26.jpg

బిగ్ బాస్ తెలుగు 8 ఆఖరి అంకానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ 8 తెలుగు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో హౌజ్‌లో మరింత ఆసక్తికరంగా విషయాలు జరుగుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయింది. 13వ వారం నామినేషన్స్ హీట్ హీట్ ఆర్గ్యుమెంట్స్‌తో పాటు ఊహించని సంఘటనలతో సాగిపోయింది. అలాగే, బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం నామినేషన్స్ ఒక్కరోజులోనే పూర్తి అయిపోయాయి. బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 25 ఎపిసోడ్‌ నామినేషన్స్‌తోనే ప్రారంభం అయింది. ఎపిసోడ్ పూర్తి అయిపోయేసరికి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయింది.

బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్ తెల్లవారు జాము మూడు గంటల వరకు జరిగాయి. అయితే, ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో యాంకర్ విష్ణుప్రియకు అధికంగా నామినేట్ ఓట్లు పడ్డాయి. ఆమెతోపాటు గౌతమ్‌కు కూడా అధికంగా నామినేషన్ ఓట్లు పడ్డాయి. విష్ణుప్రియ, గౌతమ్ ఇద్దరిని ఐదుగురు నామినేట్ చేశారు. దాంతో వీళ్లిద్దరికి హయ్యెస్ట్ ఓట్లు పడ్డాయి. విష్ణుప్రియను నబీల్, ప్రేరణ, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ ఐదుగురు నామినేట్ చేశారు. అలాగే, గౌతమ్ కృష్ణను నబీల్, పృథ్వీ, ప్రేరణ, నిఖిల్ నామినేషన్స్‌లో నామినేట్ చేస్తే యష్మీ గౌడ ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్న సమయంలో బిగ్ బాంబ్ పేలుస్తూ నామినేట్ చేసింది. దాంతో అంతా కలిపి గౌతమ్‌ను ఐదుగురు నామినేట్ చేసినట్లు అయింది.

Share this post

scroll to top