పురంధేశ్వరికి బిగ్ షాక్..

puram-18.jpg

ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరిని తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. గత పార్లమెంట్ ఎన్నికల్లో పురంధేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. కడప నుంచి రామచంద్రారెడ్డి, విశాఖ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్, నెల్లూరు నుంచి ఇసక సునీల్ ఎంపిక కొత్త బీజేపీ చీఫ్‌ పదవికి పోటీ పడుతున్నట్లు చర్చ సాగుతోంది. వీరిలో ఒకరిని ఎంపిక చేయడానికి పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరుకు కొత్త బీజేపీ చీఫ్‌ ను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వార్గాలు చెబుతున్నాయి. 

Share this post

scroll to top