సీఎం రేవంత్‌కు పరిపాలన చేత కావడం లేదు. తెలంగాణలో నిరుద్యోగులతో చర్చించే దమ్ము లేదా? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. అలాగే, రేవంత్‌కు జాబ్ క్యాలెండర్ దొరకలేదా అని కామెంట్స్ చేశారు. కాగా, కాసం వెంకటేశ్వర్లు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అధికార దాహంతో చిక్కడపల్లి లైబ్రరీలో మోకాళ్ల మీద నిలబడి నిరుద్యోగుల ఓట్లు అడిగారు. రేవంత్‌కు జాబ్ క్యాలెండర్ దొరకలేదా?. నెల రోజులుగా నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు. ఏటా 3 నుంచి 5 శాతం ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారు. ఆ పోస్టులను భర్తీ చేయడం లేదు.
రేవంత్.. నిరుద్యోగులతో చర్చించే దమ్ము లేదా..
