జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై సైబరాబాద్‌ సీపీకి ఫిర్యాదు..

madhavi-latha-21-.jpg

బీజేపీ నేత, సినీ నటి మాధవీలత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. తనను ప్రాస్టిట్యూట్‌ అంటూ పరుష పదజాలంతో దూషించిన జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌, తెలుగు ఫిలిం ఛాంబర్‌కు మాధవీలత ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై సైబరాబాద్‌ సీపీకి కూడా ఫిర్యాదు చేశారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ మాటలతో తాను, తన కుటుంబం ఎంతగానో ఇబ్బంది పడిందని ఈ సందర్భంగా మాధవీలత అన్నారు. క్షమాపణ చెప్పానంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. నాయకులు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా అని నిలదీశారు.

Share this post

scroll to top