ఇందిరా పార్క్ వేదికగా బీజేపీ మహా ధర్నా..

bjp-25-.jpg

హైదరాబాద్ ఇందిరా పార్క్ వేదికగా బీజేపీ మహా ధర్నా చేపట్టనుంది. మూసీ పునరుద్ధరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇందిరాపార్కు వద్ద తెలంగాణ బీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాలో మూసీ బాధితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పేర్కొంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ధర్నా చౌక్ వేదికగా బాధితులతో కలిసి మహా ధర్నా నిర్వహించనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. బాధితులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, మూసీ బాధితులు తదితరులు పాల్గొననున్నారు.

Share this post

scroll to top