2009లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ – గుడివాడ అమర్నాథ్‌

amarnath-a.jpg

విశాఖలో సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు గుడివాడ అమర్నాథ్‌. ఇవాళ మీడియాతో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ….పోలింగ్ పర్సంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అంచనాలు తప్పు అన్నారు. 2009లో మహాకూటమి వైఎస్సార్ మీద పోరాటం చేస్తే ఆ ఎన్నికల్లోనూ పోలింగ్ పెరిగింది…2009లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయని వెల్లడించారు.

అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలని ఉద్దేశంతోనే జనం పోటెత్తి ఓటేశారు….గతంలో వచ్చిన దానికంటే ఒక్క సీటైన ఎక్కువ వస్తుందని మా విశ్వాసం…..గ్రామీణ ఓటర్లు వైసీపీ పక్షాన నిలబడ్డారన్నారు. ఏకపక్షంగా విజయం సాధిస్తామని.. వైసీపీ ఎంపీల మద్దతు కేంద్రానికి ఖచ్చితంగా అవసరం అవుతుందని వివరించారు.

Share this post

scroll to top