తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏమీ మార్పు లేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను అరెస్ట్ చేయడం వెనుక ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. కాగా, నేడు హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం, రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీల అమలులో వైఫల్యంపై పోరాటం చేయాలని రాజకీయ తీర్మానం చేశాం. రైతులకు రైతుభరోసా రూ.15వేలు ఇస్తామని చెప్పారు.. ఇప్పటి వరకు ఇవ్వలేదు. గ్రూప్-1 పోస్టుల్లో అదనంగా కేవలం 60 పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఒక పరీక్షకు మరో పరీక్షకు 30 రోజుల గడువు ఇవ్వాలని కోరితే ప్రతిపక్షాలు పనిలేక చేస్తున్నాయని విమర్శించడం సిగ్గుచేటు.
పంచాయతీ ఎన్నికల వాయిదా కోసం కాంగ్రెస్ కొత్త డ్రామాలు ఎంపీ రఘునందన్..
