రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం కాంగ్రెస్‌ కు పరిపాటే..

cong-13.jpg

రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం కాంగ్రెస్‌కు పరిపాటే అని తెలంగాణ బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవా? అంటూ శుక్రవారం ఎక్స్ వేదికగా తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు దక్కాల్సిన ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌ పదవిని అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం అసెంబ్లీ నియమావళికి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది. రాజ్యాంగ స్ఫూర్తిని ఖూనీ చేస్తూ శాసనసభ సంప్రదాయాలను సైతం మంటగలుపుతున్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధిచెప్పక తప్పదని తెలిపింది.

కాగా, ఇటీవల పీఏసీ చైర్మన్‌గా శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ప్రకటించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని, పార్టీ మారిన వారికి పీఏసీ ఎలా ఇస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే, అరికెపూడి గాంధీ టెక్నికల్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Share this post

scroll to top