రాజ్యసభలో ఎన్డీయే కూటమి సంఖ్యాబలం 101కి పడిపోయింది. దీంతో రాజ్యసభ మెజారిటీ మార్క్ 113 కంటే ఎన్డీయే ఎంపీల సంఖ్య తక్కువగానే ఉంది. ఈ క్రమంలో అధికార ఎన్డీయే కూటమి రాజ్యసభలో బిల్లులను ఆమోదం కోసం ఇతర పార్టీలపై ఆధారపడాల్సి ఉంటుంది. రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్న వైసీపీ సహాయం ఎన్టీఏ కూటమి సర్కార్కు అవసరం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్డీయే పార్టీలైన టీడీపీ, జేడీయూలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ బలం రాజ్యసభలోనూ తగ్గింది. నామినేటెడ్ ఎంపీలైన రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేశ్ జెఠ్మలానీల పదవీకాలం శనివారంతో పూర్తయింది. అధికార పార్టీ సలహా మేరకు ఈ నలుగురిని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆ నలుగురు ప్రధాని మోదీ సారధ్యంలోని ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. శనివారంతో వీరి పదవీకాలం ముగిసిపోవడంతో రాజ్యసభలో బీజేపీ ఎంపీల సంఖ్యాబలం 86కి పడిపోయింది. పర్యవసానంగా మొత్తం 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో ఎన్డీయే కూటమి సంఖ్యాబలం 101కి పడిపోయింది. రాజ్యసభ మెజారిటీ మార్క్ 113 కంటే ఎన్డీయే ఎంపీల సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది.
వైసీపీ సాయం కావాల్సిందే..
