ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్..

boliwood-20.jpg

భార‌త‌దేశంలో అత్యంత సంపన్నురాలైన సినీ న‌టి ఎవరు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు ప్రియాంక చోప్రా, దీపిక ప‌దుకొనే, ఐశ్వ‌ర్యారాయ్ ల పేర్లు గుర్తించుకు వస్తాయి. కానీ ఈ హీరోయిన్స్ కంటే రిచెస్ట్ యాక్టర్ ఒకరున్నారు. ఈ నటి ఆస్తి విలువ 100 కోట్లో 200 కోట్లో కాదు ఏకంగా రూ. 4600 కోట్లు. అలాగే గత శతాబ్దం క్రితం వరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. వాస్తవానికి ఆ హీరోయిన్ కి ఈ మధ్యకాలంలో ఒక హిట్ సినిమా కూడా లేదు. అయినా సంపదలో ఆ బ్యూటీని మాత్రం అస్సలు టచ్ కూడా చేయలేదు. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్స్ ను వెనక్కి నెట్టి.. భార‌త‌దేశంలో అత్యంత సంపన్నురాలైన సినీన‌టిగా జూహీ చావ్లా రికార్డు కెక్కింది. హురున్ ఇండియా నివేదిక ప్రకారం రిచెస్ట్ హీరోయిన్ గా జూహీ చావ్లా నిలిచింది. సెలబ్రెటీల లిస్ట్ లో షారుక్ ఖాన్ అత్యంత ధ‌నిక న‌టుడిగా నిలిస్తే.. హీరోయిన్స్ ల్లో జూహీ చావ్లానే మొదటి స్థానంలో నిలిచింది.

Share this post

scroll to top