క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ వామిక..

heroin-08.jpg

వామికా గబ్బి ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వినిపిస్తుంది. ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే సుధీర్ బాబు హీరోగా నటించిన భలే మంచి రోజు సినిమాలో నటించింది ఈ అమ్మడు. కానీ ఈ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో ఈ బ్యూటీకి సరైన క్రేజ్ రాలేదు. ఆ తర్వాత హిందీలోనే వరుస ఆఫర్స్ అందుకుంది.భలే మంచి రోజు సినిమాలో బొద్దుగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు షాకింగ్ లుక్ లోకి మారిపోయింది. అంతే కాదు తన అందాలతో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది ఈ అమ్మడు. ఈ ముద్దుగుమ్మ పంజాబీ, హిందీ సినిమాలతో పాటు తెలుగు, మలయాళ సినిమాల్లోనూ నటించింది. ఇక రీసెంట్ గా వరుణ్ ధావన్ ,కీర్తిసురేష్ జంటగా నటించిన బేబీ జాన్ సినిమాలో నటించింది.

ఈ మూవీలో ఆమె సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది తెలుగులోనూ ఆఫర్స్ అందుకుంటుంది. అడవి శేష్ నటిస్తున్న గూఢచారి 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక వామిక ఇప్పుడు తెలుగులోనూ బిజీ హీరోయిన్ గా మారనుందని తెలుస్తుంది. అందాలతో పాటు నటనతోను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు. తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంటుందని తెలుస్తుంది. నెట్టింట క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ అమ్మడు.

Share this post

scroll to top