బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తన సినీ కెరీర్ గురించి చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అందాల ముద్దుగుమ్మ.. అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు మనవే వాటిని క్రియేట్ చేసుకోవాలంటుంది. కేవలం నటిగానే కాకుండా ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నానని వెల్లడించింది. తరచూ ఎలాంటి పాత్రల్లో నటిస్తే బాగుంటుందని, ఏదైనా కొత్త దారి ఎంచుకుంటే బాగుంటుందా? అని ఆలోచించేదాన్ని అని పేర్కొంది. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఎవ్వరికైనా వెంటనే అవకాశాలు రావు అని, ఏళ్లు గడవాలని తెలిపింది. విజయం సాధించాలంటే కొద్ది సమయం పడుతుందన అనుభవంతోనే అవకాశాలు వస్తాయని చెప్పుకొచ్చింది. దో పత్తితో వచ్చిన చాన్స్‌తో నటిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్నానని వివరించింది.
సెట్‌లో ఉత్సాహంగా ఉంటాను..
