ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక..

bostha-16.jpg

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షఫీ నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో బొత్స నామినేషన్ ఒక్కటే మిగలడంతో బొత్స ఏకగ్రీవ ఎన్నిక లాంచనం అయింది. అయితే, బొత్స సత్యనారాయణ ఎన్నిక ప్రకటన తర్వాత విశాఖ కలెక్టరేట్‌ దగగర సందడి వాతావరణం కొనసాగుతుంది. జాయింట్‌ కలెక్టర్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్‌ తీసుకున్న తర్వాత బొత్స మీడియాతో మాట్లాడుతూ బీ ఫామ్‌ ఇచ్చి పోటీకి ప్రొత్సహించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్‌​ జగన్‌ మోహన్‌ రెడ్డికి, సహకరించిన జిల్లా నేతలకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.

Share this post

scroll to top