ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 24 నుంచి శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు నోటిఫికేషన్‌ను గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్ జారీ చేశారు. 23న ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించనున్నారు. 24 ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. గతంలో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. మరి ఈ సారి జరిగే అసెంబ్లీ సెషన్‌కు గులాబీ బాస్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది.
23 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
