నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే సమయం సీఎంకు లేదా: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్

brs-15.jpg

నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే సమయం సీఎం రేవంత్‌రెడ్డికి లేదా అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం, మంత్రులు పాలన మరిచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన సర్కార్ మాట తప్పిందని అన్నారు. నిరుద్యోగులు తమ సమస్యలను తీర్చాలని నిరసన చేపడితే సెక్రటేరియట్, ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ పోలీసుల బకాగాలను మోహరించారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగుల దగ్గరకు వెళ్లారని.. ఇప్పుడు వాళ్లను ఉగ్రవాదులను చూసినట్లు చూస్తున్నారని ఆరోపించారు

Share this post

scroll to top