కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రాధాన్యతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ వరిలో నెంబర్ వన్ స్థానం అయింది. మూసీ ప్రాజెక్ట్ వల్ల మురిసేది ఏముంది. ఎంత మందికి లాభం జరుగుతుంది. ఎన్నిఎకరాలు పారుతాయని ప్రశ్నించారు కేటీఆర్. హైడ్రా కార్యాలయం కూడా ఎఫ్టీఎల్ లోనే ఉందని కూల్చాల్చి వస్తే ముందు ఆ కార్యాలయాన్ని కూల్చాలని డిమాండ్ చేశారు కేటీఆర్. FTL పరిధిలో నిర్మించిన బుద్ధభవన్ ను కూడా కూల్చాలన్నారు.
కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కార్యాలయాన్నే కూల్చాలి..
