పంచాయ‌తీ భ‌వ‌నాన్ని తాక‌ట్టు..

harish-rao-09.jpg

జగిత్యాల జిల్లా తొంబరావుపేట గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలో స్థానిక సంస్థలకు నిధులు, విధులు, నిర్వహణ పూర్తి స్థాయిలో అప్పగిస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు బీరాలు పలికార‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

ఇప్పుడు మాజీ సర్పంచులు పంచాయితీ భవనాలను తాకట్టు పెట్టే స్థితికి దిగజార్చారు. సర్పంచులు, ఎంపీటీసీలకు, జ‌డ్పీటీసీలకు గౌరవ వేతనం పెంచుతామ‌ని మభ్యపెట్టారు. ఇప్పుడు ఉన్న జీతాల బకాయిలకే దిక్కులేకుండా చేసారు. గ్రామపంచాయితీ సిబ్బందికి కనీస వేతనం, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్ గురించి కాంగ్రెస్ ఎన్నో ఆశలు కల్పించిన మాటలు రేవంత్ సర్కార్‌కు గుర్తు ఉందా మీరు చూపించిన అరచేతిలో స్వర్గం అటుంచి బకాయిలు ముందు విడుదల చేయండి భ‌ట్టి విక్ర‌మార్క గారు అని హ‌రీశ్‌రావు అడిగారు.

Share this post

scroll to top