బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్‌..

brs-1-1.jpg

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్‌ తగిలింది. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్‌ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ముందు బైఠాయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను ఏక పక్షంగా జరుపుతున్నారంటూ నిరసనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీంతో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్‌ చేసేయండి పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ఠ్‌ చేశారు. ఇక అనంతరం పోలీసు వాహనంలో బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలను బయటకు తరలించారు పోలీసులు. అంతేకాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లను తెలంగాణ భవన్ కు తీసుకెళ్తున్నారు పోలీసులు. అక్కడే వాళ్లను నిర్భంధించే ఛాన్స్‌ ఉంటుంది. ఇది ఇలా ఉండగా, అసెంబ్లీ ప్రారంభం అయిన దగ్గర నుంచి స్పీకర్ పోడియం ముందు బీఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీ నిలబడే ఉన్నారు.

Share this post

scroll to top