రేపు తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాల‌కు పాలాభిషేకాలు..

rajivu-16.jpg

సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాల‌ని బీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యించింది. రేపు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌జ‌ల‌కు తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థానంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి, తెలంగాణ తల్లిని అవమాన పరిచిన రేవంత్ రెడ్డి వైఖరిని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు. తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకున్నోళ్లెవరూ రాజకీయాల్లో బతికి బట్టకట్టలేరన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాల‌ని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.

Share this post

scroll to top