కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్..

ktr-20.jpg

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ఎన్నికల సందర్భంగా హస్తం పార్టీ ఇచ్చిన హామీలపై ట్విట్టర్ వేదికగా సెటైరికల్ ట్వీట్‌తో చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగిందేమి లేదని అన్నారు. అన్నదాతలకు రుణమాఫీ, రైతు భరోసా, సాగు నీళ్లలో కటింగ్ పెట్టారని ఆరోపించారు. గర్భిణులలకు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ కట్ చేశారని ఆక్షేపించారు.

ఎన్నికల సందర్భంగా మహిళలకు తులం బంగారం, ప్రతి ఒక్కరికీ రూ.2,500 కోత పెట్టారని అన్నారు. ఆసరా ఫింఛన్లు రూ.4 వేలు, రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, జాబ్ క్యాలెండర్ , ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు, విద్యార్థులు ఎలక్ట్రిక్ స్కూటీలు, తెలంగాణ అమర వీరులకు రూ. 25 వేల పింఛను, ఉద్యమకారులకు 250 గజాల స్థలం, రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల భృతి, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం, ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనం, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ.10 వేలకు పెంపు కలగానే మిగిలాయని అన్నారు.

Share this post

scroll to top