రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 23వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ వెళ్లనున్నారు. ఏప్రిల్ 27న జరిగే బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సన్నాహక సమావేశంలో పాల్గొని, పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. వరంగల్ బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చి బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం గులాబీ జెండానే అని కేటీఆర్ పేర్కొన్నారు.
రేపు కరీంనగర్‌కు కేటీఆర్..
