కొల్లేరుకు పొంచి ఉన్న బుడమేరు ముంపు గండం..

kolaru-10.jpg

బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. బుడలేరు వరదకు దాదాపు 20 డ్రెయిన్ ల నుంచి వచ్చే వర్షం నీరు తోడు కావడంతో కొల్లేరు సరస్సులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఏలూరు రూరల్ పరిధిలోని గుడివాకలంక, పత్తికోళ్లంక, మొండికోడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా మండవల్లి గ్రామంలో పెనుమాకలంక, మణుగూరు వంటి 9 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. ఏలూరు కైకలూరు రహదారిపై ఆరు రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం కొనసాగడంతో కొల్లేరు గ్రామాల పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కొల్లేరులో నీటిమట్టం క్రమంగా పెరుగుతండడంతో స్థానికులతో పాటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Share this post

scroll to top