జగన్ అధికారంలోకి రావడం కలే..

venkanna-17.jpg

దోచుకున్న లక్షల కోట్లతో సోషల్ మీడియాని నడిపిస్తున్నారని, ఆ డబ్బులతో సోషల్ మీడియాతో కూటమి నేతలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజలు వైసీపీ పార్టీని అసహ్యించుకుంటున్నారని, ఆ 11 సీట్లు ఎందుకు ఇచ్చామా అని ప్రజలు ఆలోచిస్తున్నారని, పూర్తిగా భూస్థాపితం చేస్తే బాగుండనని అనుకుంటున్నారన్నారు. పేర్ని నాని బందర్‌ను ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఇప్పటివరకు పోర్టు అనేది పూర్తి చేయలేదని విమర్శించారు. చంద్రబాబు పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తారన్నారు. మచిలీపట్నానికి రూ. 70వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ తీసుకొస్తున్నారని, ఇక జగన్ అధికారంలోకి రావడం కలే అన్నారు. చంద్రబాబుకు మరో అవకాశం వచ్చినట్లు, వైసీపీకి కూడా మళ్లీ అధికారం వస్తుందని పగటి కలలు కంటున్నారన్నారు. వైసీపీ వాళ్ళ దొంగతనాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడి ప్రెస్ మీట్‌లు పెడుతున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. చంద్రబాబు సీఎం అవ్వగానే పెంచిన పింఛన్లు అందించారని.. అదే జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ప్రజావేదిక కూల్చారని ఎద్దేవా చేశారు. అసలు చెత్త పన్ను వేసింది ఎవరు?.. జగన్ ఐదు సంవత్సరాలు పాటు రాష్ట్రాన్ని చెత్త గా మార్చేశారని.. చంద్రబాబు ఆ చెత్తంతా క్లీన్ చేస్తున్నారని, 35 రోజుల్లోనే ఆ చెత్త అంత క్లీన్ అయిపోతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఎప్పుడైనా జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేశారా? అని నిలదీశారు.

Share this post

scroll to top