ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే..

cabinate-18.jpg

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌ తన నివేదికను మంత్రి వర్గానికి అందించింది. దీనికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణలో మాదిరిగానే ఎస్సీ వర్గీకరణను ఏకసభ్య కమిషన్‌ మూడు కేటగిరీలుగా రూపొందించింది. గ్రూప్‌-1, 2, 3గా రెల్లి, మాదిగ, మాల ఉపకులాల వర్గీకరించారు. ప్రస్తుతం ఏపీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండగా.. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం ఈ బిల్లుపై సభలో ప్రత్యేకంగా చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత ఈ బిల్లును కేంద్రానికి పంపనున్నారు. కాగా ఈ ఎస్సీ వర్గీకరణను మాల సామాజిక వర్గం తీవ్రంగా విభేదిస్తున్న సంగతి తెలిసిందే

Share this post

scroll to top