టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునను వివాదాలు చుట్టముడుతున్నాయి. ఎన్-కన్వెన్షన్ కూల్చివేత నుంచి ప్రారంభమైన పంచాయతీ తాజాగా ఆయనపై కేసు నమోదు వరకు వెళ్లాయి. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడికుంటను కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ నిర్మించి కబ్జాలకు పాల్పడి లాభాలు ఆర్జించారని ఆయనపై వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలంటూ జనంకోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెరువును నాగార్జున కబ్జా చేసినట్లు ఇరిగేషన్ అధికారులు ధృవీకరించిన ఆధారాలతో ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మాదాపూర్ పోలీసులు ఫిర్యాదును కూడా స్వీకరించినట్లుగా ఆయనకు కాపీ ఇచ్చారు.
భాస్కర్ రెడ్డి నాగార్జునపై లీసులకు ఫిర్యాదు..
