వైఎస్‌ జగన్‌ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్‌సిగ్నల్‌..

ys-jagan-28.jpg

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట దక్కింది. విదేశాలకు వెళ్లేందుకు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించిన సీబీఐ కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సెప్టెంబర్‌ 3వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు యూకేలో ఉన్న కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు సీబీఐ కోర్టులో జగన్‌ 15 రోజుల క్రితం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు మంగళవారం సాయంత్రం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. యూకే వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నంబరు, మెయిల్‌ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. అదేవిధంగా ఐదేళ్ల కాలపరిమితితో కొత్త పాస్‌పోర్టు జారీకి అనుమతి ఇచ్చింది .

Share this post

scroll to top