అమిత్ షాకు విజయసాయిరెడ్డి రిక్వెస్ట్..

vijaya-sai-reddy-11.jpg

జనగణనలో కులగణనపై రెండు లేదా మూడు ప్రశ్నలు చేర్చాలని మాజీ ఎంపీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి కోరారు. జనగణనపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కీలక రిక్వెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాబోయే సాధారణ జనాభా గణనలో సామాజిక-ఆర్థిక కుల గణన ని చేర్చాలని అమిత్ షాను కోరారు. కేవలం రెండు లేదా మూడు ప్రశ్నలను జోడించడం ద్వారా, ఈ ఏకీకరణను సజావుగా, సమర్ధవంతంగా సాధించవచ్చని తెలిపారు. సెన్సస్‌తో పాటు సామాజిక-ఆర్థిక కుల గణన నిర్వహించడం వల్ల సమయం, వనరులు ఆదా అవుతాయని సూచించారు. అలాగే దీని వల్ల సామాజిక-ఆర్థిక వాస్తవాల ను బాగా అంచనా వేయడానికి.. తదుపరి లక్ష్యాలను, భవిష్యత్తు కేంద్రీకృత విధానాలను ప్లాన్ చేయడానికి ప్రభుత్వాలకు కూడా అధికారం లభిస్తుందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

Share this post

scroll to top