విభజన చట్టానికి అనుగుణంగా చర్యలు..

nirmala-23.jpg

విభజన చట్టం ప్రకారం ఏపీలో ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ, ఎన్ ఐ టీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రో యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు కావల్సి ఉంది. ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లడించారు. విభజన చట్టానికి అనుగుణంగా చర్యలు చేపట్టనున్నామన్నారు. అమరావతి నిర్మాణానికి బహుళ సంస్థల ద్వారా నిధులు సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి నిర్మలమ్మ సాధ్యమైనంత వరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం అభివృద్ధికి నిధులను కేటాయిస్తామన్నారు. విశాఖ-చెన్నై, ఓర్వకల్లు-బెంగళూరు పారిశ్రామక కారిడార్‌కు నిధులు చేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.

Share this post

scroll to top