వన్ నేషన్ వన్ ఎలెక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం..

cabinat-18.jpg

కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ కు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన నివేదికకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రానున్న శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టబోతోంది. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదముద్ర వేసింది. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదన కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం. 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై మాజీ రాష్ట్రపతి కమిటీ సభ్యులతో చర్చించారు. 

Share this post

scroll to top