ఏపీలో కలెక్టర్ల సమావేశం ఇవాళ అమరావతి సచివాలయంలో ప్రారంభమైంది. ఇందులో సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యంగా అధికారులు పనిచేయాలని ఆయన కోరారు. కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం కాదని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుందని, కొందరు అభివృద్ధి చేస్తే మరికొందరు నాశనం చేస్తారని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీఇచ్చామని, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ విధానమని తెలిపారు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదన్నారు. సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలన్నారు. తెలుగుదేశం పార్టి నాలుగు వందలతో ప్రారంభించిన పింఛను నాలుగు వేలకు చేశామని తెలిపారు. ఇది దేశంలో ఎక్కడా లేదన్నారు. 204 అన్నా క్యాంటిన్లు పెట్టామన, ఇదో స్పూర్తి అని తెలిపారు.
మెగా డీఎస్సీ తేదీ, తల్లికి వందనంపై చంద్రబాబు ప్రకటన..
