కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులందరికీ పంట బీమా అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. విపత్తు సమయాల్లో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ఉచిత పంటల బీమాను అందరి రైతులకు అమలు చేస్తున్నట్లు మంత్రి అసెంబ్లీలో వెల్లడించారు. కేంద్రం సూచించిన విధానాల్లో ఉత్తమ విధానం అమలు చేస్తా్మన్నారు. వచ్చే ఏడాది నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తామి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ఏడాది మాత్రం గత ప్రభుత్వం అనుసరించిన విధనాన్నే కొనసాగిస్తామని.. వచ్చే ఏడాది కొత్త విధానం తీసుకువస్తామన్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో బీమా ప్రీమియం భారం రైతులపై పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకూ ఉచిత పంటల బీమా అమలు చేయనుంది. కరువు, తుపాను వంటి విపత్తులతోపాటు వాతావరణ ప్రభావంతో పంట దిగుబడి తగ్గిపోయిన పరిస్థితుల్లో ఈ పథకం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్..
