చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు..

nani-30.jpg

రాష్ట్రంలో చంద్రబాబు అతిపెద్ద రాజకీయ అవకాశవాది నమ్మిన వారిని మోసం చేయడం ఆయనకు అలవాటు అని, అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏనాడూ తన సొంత బలంతో గెలవలేదని గుర్తు చేశారు. ఇంకా ప్రలోభాలు, కొనుగోళ్లు చంద్రబాబుకు అలవాటు అని, ఇప్పుడు కూడా యథేచ్ఛగా తమ పార్టీ ఎంపీలను కొనుగోలు చేశారని, అది చూస్తుంటే ఆయనపై జాలి కలుగుతోందని అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ చెక్కుచెదరదని, తమ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌గారిని ఏమీ చేయలేరని పేర్ని నాని స్పష్టం చేశారు.

Share this post

scroll to top